telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు

ఈరోజు బంగారం ధరలు ఇలా…?

కరోనా వైరస్ అలాగే కొత్త ఏడాది‌ ప్రభావంతో బంగారం ధరలు ఇవాళ పెరిగిపోయాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు క్రమంగా పెరిగిన విషయం తెలిసిందే. దీపావళి పండుగ అయిపోగానే బంగారం ధరలు దిగివచ్చాయి. దీపావళి కంటే ముందు బంగారం, వెండి ధరలకు రెక్కలు వచ్చాయి. కరోనా వైరస్‌ విజృంభించిన తర్వాత బంగారం ధరలు చుక్కలు చూపించిన ఇప్పుడు మళ్ళీ మార్కెట్ పుంజుకోవడంతో ధరలు తగ్గాయి. కానీ ఈరోజు ఢిల్లీలో హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగిపోయాయి. కరోనా అనంతరం 50 వేల ను దాటింది బంగారం. అయితే ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 10 పెరిగి రూ. 53,510 పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 10 పెరిగి రూ. 49,060 వద్ద ముగిసింది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే.. బంగారం ధరలు ఇవాళ కొంచెం పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 10 పెరిగి రూ.51,180 వద్ద ఉండగా… 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 10 పెరిగి రూ.46,910 పలుకుతోంది. ఇక వెండి విషయానికి వస్తే స్థిరంగా రూ.72,000 వద్ద ఉంది.

Related posts