telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పరిపాలన అంటే సూటుబూటు వేసుకొని అమెరికాలో తిరగడం కాదు..జగన్ పై దేవినేని ఫైర్

devineni on power supply

పరిపాలన అంటే సూటుబూటు వేసుకొని అమెరికాలో తిరగడం కాదని సీఎం జగన్ తీరుపై మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గోదావరి వరదలొస్తే సీఎం జగన్‌ ఇజ్రాయెల్‌ వెళ్లారని ఎద్దేవా చేశారు. గోదావరి వరదలపై ఒక్క సమీక్షా సమావేశం చేయలేదని విమర్శించారు. లోకేష్‌ పర్యటించిన తర్వాతే జగన్‌ ఏరియల్‌ సర్వే చేశారని అన్నారు.

జగన్‌ది ప్రభుత్వం అని ధ్వజమెత్తారు. రాయలసీమకు ఎందుకు నీళ్లు ఇవ్వలేకపోయారని ఉమ ప్రశ్నించారు. కృష్ణా డెల్టా రైతులు మోటార్లతో నీళ్లు తెచ్చుకుంటున్నారని అన్నారు. సినిమాలు చూసినంత మాత్రాన నటులు కాలేరని దేవినేని ఉమ వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఇంటిని ముంచాలన్న తపన తప్ప కేబినెట్‌ ఏం చేసింది? అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే బూతులు తిడుతున్నారని విమర్శించారన్నారు. ప్రతిపక్షం గొంతు నొక్కడం కాదని, ప్రజల్లోకి వెళ్లాలని హితవు పలికారు. . మూడు నెలలు తిరగకుండానే ప్రజలు వాస్తవాలు చెబుతున్నారని, అడ్డా మీద ఏ కూలీని అడిగినా వైసీపీ అడ్డగోలు భాగోతాలను చెబుతారని పేర్కొన్నారు.

Related posts