టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద పండుగ సందర్భంగా రెండు భారీ చిత్రాలు విడుదల అయ్యాయి. అవే మహేష్ సరిలేరు నీకెవ్వరూ , అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో. జనవరి 11 న సరిలేరు రాగా.ఈరోజు అల చిత్రం వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. భారీ అంచనాల మధ్య ఈ రెండు చిత్రం రిలీజ్ అవ్వడం తో కలెక్షన్ల ఫై అంత అరా తీస్తున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు అమెరికా లో సరిలేరు ప్రీమియర్ కలెక్షన్లను అల క్రాస్ చేసిందని తెలుస్తుంది.
ఓవర్సీస్ లో మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకు తొలిరోజు కలెక్షన్లు 417,559 డాలర్లు రాబట్టగా.. ‘అల వైకుంఠపురంలో’ ప్రీమియర్‌కి 590,216 డాలర్ల వసూళ్లు వచ్చినట్లు సినీ విశ్లేషకుడు రమేష్ బాలా ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఈ రకంగా చూసుకుంటే అమెరికాలో ‘అల వైకుంఠపురంలో’ ఓ రేంజ్‌లో దూసుకుపోతోందనే చెప్పాలి. అమెరికాలోనే కాదు న్యూజిల్యాండ్‌లో ‘అల వైకుంఠపురంలో’ రికార్డు క్రియేట్ చేసింది. అక్కడ మూడు ప్రదేశాల్లో విడుదలైన ఈ సినిమా ఐదు షోలకే 34,625 డాలర్లు వసూలు చేసింది. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు రాలేదని రమేష్ బాలా చెప్పుకొచ్చారు.