ప్రపంచ కప్ లో భాగంగా నేడు భారత్-ఇంగ్లాండ్ తో తలపడుతున్న విషయం తెలిసిందే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆతిధ్య జట్టు ప్రారంభం నుండే షాట్లు కొడుతూ భారత ఆటగాళ్లకు చెమటలు పట్టించింది. మొత్తానికి ఒక్క వికెట్ దక్కించుకున్న టీమిండియా ఊపిరి పీల్చుకుంది. ఎట్టకేలకు 160 పరుగుల వద్ద ఇంగ్లాండ్ తొలి వికెట్ పడింది.
బౌలర్ కుల్దీప్ యాదవ్ టీమిండియాకు బ్రేకిచ్చాడు. యాదవ్ విసిరిన బంతికి ఇంగ్లాండ్ ఓపెనర్ జాసన్ రాయ్ లాంగాన్ లో క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. రాయ్ 66 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ స్కోరు 23 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 163 పరుగులు. ఓపెనర్ జానీ బెయిర్ స్టో 90, రూట్ 2 పరుగులతో ఆడుతున్నారు.