telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

ట్రంప్ ట్వీట్.. కిమ్ క్లీన్ స్వీప్.. సాహసం సేయరా డింభకా.. !

trump and kim meet at boarder on tweet

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జపాన్ లో జి-20 దేశాల సదస్సులో పాల్గొనేందుకు వచ్చి, ట్విట్టర్ లో అప్పటికప్పుడు చేసిన ఓ ట్వీట్ చారిత్రక సంఘటనకు దారితీస్తుందని ఎవరూ ఊహించలేదు. నా ఈ ట్వీట్ ను ఉత్తర కొరియా దేశాధినేత కిమ్ గనుక చూస్తే ఆయనకో విజ్ఞప్తి! కిమ్ ను దేశ సరిహద్దుల్లోని నిస్సైనిక మండలంలో కలిసి హలో అంటూ కరచాలనం చేయాలనుకుంటున్నాను అంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. దీనిపై ఉత్తర కొరియా విదేశాంగ మంత్రిత్వ శాఖ వెంటనే స్పందించి ఇదో ఆసక్తికరమైన ప్రతిపాదన అంటూ స్పందించింది. ఆ తర్వాత పరిణామాలు వేగంగా జరిగిపోయాయి.

ట్రంప్ ఉత్తర కొరియా సరిహద్దులోని నిస్సైనిక ప్రాంతంలో అడుగుపెట్టగా, ఆయనకు కిమ్ జోంగ్ ఉన్ తమ దేశ భూభాగంలోకి స్వాగతం పలకడం చరిత్ర పుటలకెక్కింది. ఆపై ఇరువురు కరచాలనం చేసుకుని కాసేపు మాట్లాడుకుని ఈసారి దక్షిణ కొరియా భూభాగంలోకి ప్రవేశించారు. అక్కడ వారికి దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ తోడయ్యారు. దీనిపై ట్రంప్ స్పందిస్తూ, ప్రపంచానికి ఇదో గొప్ప సుదినం అని, తాను ఇక్కడికి రావడాన్ని మహా గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. అటు కిమ్ మాట్లాడుతూ, ఓ అమెరికా అధ్యక్షుడు ఉత్తర కొరియా గడ్డపై కాలుమోపడం ఇదే ప్రథమం అని, ట్రంప్ చాలా ధైర్యంగా వ్యవహరించారని కొనియాడారు.

Related posts