తెలంగాణలో మరో ప్రవేశ పరీక్ష నోటిఫికేష్‌న్ రిలీజ్ అయింది. తెలంగాణ వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానాకి నిర్వహించే ఐసెట్ నోటిఫికేషన్‌ను కంట్రోలర్ మహేందర్‌రెడ్డి ఇవాళ రిలీజ్ చేశారు. ఈ నెల 7 నుంచి జూన్ 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. రూ. 250 అపరాధ రుసుముతో జూన్ 30 వరకు, రూ. 500 అపరాధ రుసుముతో జూలై 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 19, 20 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నారు అధికారులు. సెప్టెంబర్ 17న ఫలితాలు రిలీజ్ చేయనున్నట్లు మహేందర్‌రెడ్డి వెల్లడించారు. v ఆగస్టు 13 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించనున్నారు.
★ ఈ నెల ఏడో తేదీ నుండి ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం
★ జూన్ 15 న తుది గడువు
★ 250 రూపాయల అపరాధ రుసుముతో జూన్ 30 వరకు
★ 500 రూపాయలు అపరాధ రుసుముతో జూలై 15 వరకు
★ ఆగస్టు తేదీ 19/20 రెండు రోజుల్లో పరీక్ష
★ సెప్టెంబర్ పరీక్ష 17న ఫలితాల విడుదల
◆ 14 రీజినల్ సెంటర్లలో పరీక్షను నిర్వహించనున్న అధికారులు
◆ పరీక్ష నిర్వహణ కోసం 60 సెంటర్ల గుర్తింపు