telugu navyamedia
క్రీడలు వార్తలు సామాజిక

నా ఆలోచన సరలిని రవిశాస్త్రి మార్చేశాడు: సచిన్

schin ravishastri

భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ మ్యాచ్ ల్లో ఎన్నో రికార్డులు నమోదు చేశాడు. అంతటి దిగ్గజం కూడా తొలి సిరీస్ లో ఎంతో నిరాశకు గలోనయ్యాడట. పెద్దగా పరుగులు చేయలేకపోవడంతో కెరీర్ ముగిసినట్టేనని భావించాల్సి వచ్చిందని సచిన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. సచిన్ 16 ఏళ్ల వయసులోనే భారత జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. సచిన్ తొలి పర్యటన పాకిస్థాన్ లో జరిగింది.

ఆ సమయంలో వసీం అక్రమ్, వకార్ యూనిస్ జోడీ శత్రుభీకర ద్వయంగా పేరుతెచ్చుకుంది. అలాంటి ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొంటూ సచిన్ తన తొలి అంతర్జాతీయ ఇన్నింగ్స్ లో 15 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దాంతో అదే తన చివరి ఇన్నింగ్స్ అని నిర్ధారణకు వచ్చేశాడట. అయితే తన ఆలోచనా సరళిని అప్పటి సీనియర్ ఆటగాడు రవిశాస్త్రి మార్చేశాడని సచిన్ వివరించాడు. రవిశాస్త్రి ఇచ్చిన సలహా తన కెరీర్ నే మార్చేసిందని సచిన్ వెల్లడించాడు.

Related posts