telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

కోవిడ్ పై బైడెన్‌ కీలక వ్యాఖ్యలు…

Joe Biden USA

కరోనా ప్రపంచాన్ని ఇంకా వణికిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వైరా కేసులు కొన్ని దేశంలో తగ్గుతున్న అమెరికాలో మాత్రం తగ్గడం లేదు. అయితే అక్కడ కరోనావైరస్‌ మరణాల సంఖ్య 6 లక్షల మార్క్‌ను కూడా క్రాస్‌ చేయవచ్చని హెచ్చరించారు ఆ దేశ కొత్త అధ్యక్షుడు జో బైడెన్… కోవిడ్ -19తో పోరాడటానికి, ఈ సమయంలో కష్టాల్లో పడిపోయిన అమెరికన్లకు ఆర్థిక ఉపశమనం కలిగించే 1.9 ట్రిలియన్ డాలర్ల ప్రణాళికపై వేగంగా ముందుకు వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.. యూఎస్‌లో ఇప్పటి కోవిడ్‌ మరణాల సంఖ్య 4 లక్షలకు చేరిందని.. ఆ సంఖ్య వచ్చే నెలలోనే 5 లక్షలు దాటొచ్చన్న ఆయన… మొత్తంగా కరోనా మరణాలు దేశవ్యాప్తంగా 600,000 పైగా చేరుకుంటాయని భావిస్తున్నానని వెల్లడించారు. చాలా కుటుంబాలు ఆకలితో ఉన్నాయి. మరిన్ని ఉద్యోగాలు తొలగించే ప్రమాదం కూడా లేకపోలేదు.. ఉద్యోగ నష్టాలు మళ్లీ పెరుగుతున్నాయి.. ఈ సమయంలో వాటిని అడ్డుకోవడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తన రెస్క్యూ ప్లాన్ ద్వారా ప్రజల సహాయం చేసేందుకు ముందుకు వెళ్లాలనుకుంటున్నాను.. దీనికి సభలోని రెండు పార్టీలతో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నట్టు బైడెన్‌ తెలిపారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts