ఇటీవల యువరాజ్ సింగ్ వరుసగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత భారత్ క్రికెట్ జట్టు గురించి ఆసక్తికర కామెంట్లు చేయడంతో పాటు తాను ఎందుకు క్రికెట్ వీడ్కోలు పలకాల్సి వచ్చిందనే విషయాన్ని గత కొన్ని రోజులుగా అభిమానులతో షేర్ చేసుకుంటూనే ఉన్నాడు యువీ. తాజాగా యువీ పోస్ట్ చేసిన ఒక ఫోటో వైరల్‌గా మారింది. క్లీన్ షేవ్‌తో కొత్త లుక్‌లో ఉన్న ఫోటోను యువీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దీనికి ‘చిక్నా చమేలా’ లుక్ ఎలా ఉందంటూ కింద క్యాప్షన్ ఇచ్చాడు. తాను మళ్లీ గడ్డాన్ని పెంచాలని అనుకుంటున్నారా అని అభిమానుల్ని ప్రశ్నించాడు.
దానికి టెన్నిస్ స్టార్ సానియా మీర్జా స్పందించారు. ఈ లుక్ దాదాపు బాలేదని అర్ధం వచ్చేలా రిప్లై ఇచ్చిన సానియా.. మళ్లీ యువీని గడ్డంతో చూడాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. గడ్డాన్ని తీసేసి నీ అట్రాక్టివ్ లుక్‌ను దాచేశావా అంటూ బదులిచ్చారు. మళ్లీ గడ్డం పెంచూ అంటూ యువీని ట్రోల్ చేశారు సానియా.