telugu navyamedia
సినిమా వార్తలు

లవ్ మరియు క్రైమ్ థ్రిల్లర్  “ఆధారం” ఫస్ట్ లుక్

మోహన్ బాబు ను హీరోగా కేటుగాడు సినిమా కి పరిచయం చేసిన నిర్మాత శ్రీ వల్లూరిపల్లి వెంకట్రావు గారి వారసురాలు చిరంజీవి సితార వెల్లూరిపల్లి సమర్పణలో శ్రీ వెంకట లక్ష్మి క్రియేషన్స్ పతాకంపై సూర్య భరత్ చంద్ర, రేణు శ్రీ ,నిరోషా హీరో హీరోయిన్లుగా గోపి పోలవరపు స్వీయ దర్శకత్వంలో వస్తున్న’ఆధారం’. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను  ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా వచ్చిన నిర్మాత బెక్కం వేణుగోపాల్ గారు  చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.

బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఈ చిత్ర దర్శక,నిర్మాత గోపి గారు ఎప్పుడు మా సినిమాలను ఆదరిస్తుంటాడు. అందుకే ఇప్పుడు తను తీస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు పిలవగానే వచ్చాను. గోపి గారు కొత్త కథలతో కొత్త టాలెంట్ ని బయటకు తీసుకురావాలని ఎప్పటినుంచో నాతో అనేవాడు. ఆ క్రమంలోనే ఈ “ఆధారం” సినిమాలో కూడా కొత్త నటీ నటులతో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. లవ్ ఎమోషన్,థ్రిల్లర్ గా వస్తున్న ఈ “ఆధారం” సినిమా తనకు మంచి పేరు తీసుకురావాలి అన్నారు.

నిర్మాత గోపి పోలవరపు మాట్లాడుతూ .. ఇక్కడకు వచ్చి మా  ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన బెక్కం వేణుగోపాల్ గారికి ధన్యవాదాలు. వారి సినిమాలు నేను ఎప్పటి నుంచో చూస్తూ వారిలాగే  చేయాలని నేను ఫాలో అవుతుంటాను. మరుగున పడిన మంచి టాలెంట్ ని బయటికి తీసుకు రావాలనే తపనతో కొత్త నటీ నటులతో ఈ సినిమా చేస్తున్నాను అన్నారు.

సంగీత దర్శకుడు నజీర్ మాట్లాడుతూ ..ఇది నా మొదటి సినిమా ఇందులో రెండు పాటలు ఉన్నాయి .రెండు పాటలు కూడా చాలా బాగా వచ్చాయి.సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా అవకాశ మిచ్చిన నిర్మాతకు నా ధన్యవాదాలు అన్నారు.

హీరో సూర్య మాట్లాడుతూ.. స్టొరీ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం ప్రొడ్యూసర్ అన్ని ఆయనే అయ్యి  సినిమాకి మా అందరికీ  ఆధారం అయ్యారు అని అన్నారు.


రేణు శ్రీ మాట్లాడుతూ.. ఇది నా మొదటి సినిమా నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు గోపి గారికీ నా ధన్యవాదాలు అన్నారు.
బొగతా సత్యనారాయణ మాట్లాడుతూ ..ఈ ఆధారం సినిమా మా అందరికీ ఆధారం కావాలి గోపి గారు ఎంతో శ్రమపడి కొత్తవారికి అవకాశం ఇచ్చారు నేను రంగస్థలం వంటి పెద్ద సినిమాలకు పని చేశాను గోపి వారు నాకు ఇందులో పురోహితుడు విషమిచ్చి నన్ను ఎంకరేజ్ చేశారు నిర్మత గోపి గారు చాలా కష్టపడ్డారు హీరోహీరోయిన్లు ఆర్టిస్టులందరూ కూడా చాలా చక్కగా నటించారు అందరికీ అవకాశం ఇచ్చి అందరికీ ఆధారం అయ్యారు గోపి గారు. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది అన్నారు

Related posts