telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సురేఖా నటి వాణి!

నటి సురేఖావాణి ఫ్యామిలీ పాత్రల్లో దాదాపు అగ్రహీరోలందరి సినిమాల్లోనూ కనిపించారు. గ్లామరస్ పాత్రలకు సురేఖా దూరం అనే నమ్మకాన్ని ప్రేక్షకుల్లో కలిగించారు. దీంతో ఆమెపై మంచి అభిప్రాయం ఏర్పడింది. ఇటీవల కాలంలో ఆమె కూతురితో కలిసి ఫొటోలు దిగి ప్రేక్షకులతో పంచుకున్నారు. అయితే..సురేఖా వాణి రెండో పెళ్లి చేసుకోబోతున్నారని గత రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. సురేఖ వాణి కుమార్తె సుప్రీత నిర్ణయం మేరకు ఆమె రెండో పెళ్లికి అంగీకారం తెలిపిందని… దీంతో త్వరలోనే ఆమె రెండో వివాహం చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతూ వచ్చింది. దీంతో సురేఖ వాణి రెండో పెళ్లిపై చర్చ మొదలైంది. వీటిన్నంటికి తాజాగా సురేఖ వాణి క్లారిటీ ఇచ్చారు. అవన్నీ అవాస్తవాలేనని తాను రెండో పెళ్లి చేసుకోవడం లేదని స్పష్టం చేసింది. సురేఖ భర్త రెండేళ్ల క్రితం అనారోగ్యం కారణంగా మరణించారు. అప్పటి నుంచి సురేఖా వాణి తన కూతురు సుప్రీతతో కలిసి ఒంటరి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. 

Related posts