telugu navyamedia
సినిమా వార్తలు

ఇన్‌స్టెంట్ స్టోరీలు, డైలాగ్స్ వద్దు…టాలీవుడ్ డైరెక్ట‌ర్స్‌కి చిరు మంద‌లింపు

*ఇన్‌స్టెంట్ స్టోరీలు, డైలాగ్స్ వద్దు..
*టాలీవుడ్ డైరెక్ట‌ర్స్‌కి చిరు మంద‌లింపు
* లాల్‌సింగ్ చ‌డ్డా ప్ర‌మోష‌న్స్‌లో చిరంజీవి కామెంట్స్‌

మెగాస్టార్‍ చిరంజీవి టాలీవుడ్ దర్శకులకి కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారు. లాల్‌సింగ్‌ చడ్డా సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆయన నటులు ఎదుర్కునే సమస్యల గురించి దర్శకులను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

”కొందరు డైరెక్టర్లు షూటింగ్ స్పాట్‌లో అప్పటికప్పుడు డైలాగ్‌లు ఇస్తున్నారని, దీని వల్ల నటులు చాలా ఇబ్బందులు పడుతున్నారని వ్యాఖ్యానించారు.. నాకు కూడా చాలా సార్లు ఇలాంటి అనుభవం ఎదురైంద‌ని వెల్లడించారు. .

స్క్రిప్ట్ విషయంలో డైరెక్టర్లు మరింత శ్రమించాలని , స్క్రిప్ట్‌ గురించి మిగతా టెక్నిషియన్స్‌కు ముందుగానే తెలిస్తే వారు పనిచేసే విధానం వేరు. దానికి వచ్చే ఫలితం వేరేలా ఉంటుంది. ఆ ఫలితం సినిమాపై చూపిస్తుంది.

. స్పాట్‌లో అప్పటికప్పుడు డైలాగులు రాయడం వల్ల డైలాగులు చదవడానికే సమయం సరిపోతుందని, ఇక నటనపై దృష్టి ఎలా పెడతామని ఆయన ప్రశ్నించారు.

ఏమైపోయిందంటే.. సినిమాలో ప్రధాన హీరోకు సినిమా తెలుసోమో సీన్స్‌ అవి. అప్పుడే వచ్చిన కమెడియన్స్‌కు గానీ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌లకు మాత్రం తెలియదు. అప్పటికప్పుడు ఆ డైలాగ్‌లు చెప్పి చేయించడంతో అంతగా ఇన్వాల్వ్‌మెంట్‌ అంతంతమాత్రంగానే ఉంటుంది. అందుకే వర్క్‌షాప్‌లు నిర్వహించాలి. ముందుగా డైలాగ్‌లు ఇవి అని చెప్పాలి. ఆ డైలాగ్‌లు ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్‌ చేయాలి. గదిలో రౌండ్‌టేబుల్‌పై కూర్చొని ఆ సీన్లు అనుకుని వాళ్లు గనుక చేయగలిగితే తర్వాత సెట్స్‌కు వెళ్లాక నా డైలాగ్‌ ఏంటని.. అది ఎలా గుర్తుంచుకోవాలని.. డైలాగ్‌ గుర్తుపెట్టుకోవండపై మనసు పెట్టక్కర్లేదు. అప్పుడు కేవలం నటనపైనే మనసు పెడితే చాలు అని అన్నారు.

దర్శకులు ముందుగానే స్క్రిప్ట్‌ని లాక్ చేసి.. నటులకి, టెక్నీషియన్స్‌కి పూర్తి అవగాహన కల్పించగలిగితే వంద శాతం అవుట్‌పుట్‌ బాగా వస్తుందని అన్నారు. ఈ విషయంలో బాలీవుడ్‌ దర్శకులని చూసి నేర్చుకోవాలని అన్నారు. దీంతో టాలీవుడ్ లో మెగాస్టార్‌ కామెంట్స్ హాట్ టాఫిక్‌గా మారింది..  

Related posts