telugu navyamedia
తెలంగాణ వార్తలు

ప్రథమ పౌరురాలిగా బాధ్యతతోనే వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లా..

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కేసీఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ వెళ్లిన గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్.. నేడు నూతన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ  స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం గవర్నర్ తమిళిసై మీడియాతో మాట్లాడారు.

మొట్ట మొదటిసారిగా ఒక గిరిజన మహిళ ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అయ్యారని, ఇది దేశం గర్వించదగిన అంశమని గవర్నర్‌ తమిళిసై అన్నారు. మహిళా రాష్ట్రపతి కింద మహిళా గవర్నర్‌గా పని చేయడం సంతోషంగా ఉందన్నారు.ఆమె రాష్ట్రపతి కావడం మహిళలకు దక్కిన గౌరవంగా అని చెప్పారు.  కింది స్థాయి నుంచి వచ్చిన మహిళ.. దేశానికి రాష్ట్రపతి కావడం కేవలం భారత్‌లోనే సాధ్యమైంద‌ని అన్నారు.

వర్షాలు వచ్చాయి కాబట్టి వరద ప్రాంతాల్లో తిరిగానని గవర్నర్ తమిళిసై అన్నారు. ప్రొటోకాల్‌లో మార్పులేదని, వరదల సమయంలో కలెక్టర్‌ కూడా రాలేదని అన్నారు.

తాను తెలంగాణ ప్రథమ పౌరురాలిగా బాధ్యతతోనే వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లానన్నారు.రాష్ట్రంలో వరదలపై రాజకీయం చేయడం మంచిది కాదని, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తెలంగాణకు వచ్చాయ‌ని అన్నారు.వరదలవల్ల కలిగిన నష్టంపై కేంద్రానికి ఇప్పటికే నివేదిక పంపించానన్నారు. 

ప్రగతి భవన్ , రాజ్‌భవన్ గ్యాప్‌పై తానిప్పుడేమీ వ్యాఖ్యానించనని అన్నారు. వరదలకు క్లౌడ్‌బస్టర్ కారణం అన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై తాను బరెస్ట్ కానని అన్నారు.

గవర్నర్‌ను కాబట్టి రాజ్‌భవన్‌కే పరిమితం కాను. ప్రజలకు అందుబాటులో ఉండటమే నా లక్ష్యం. నాకు తోచిన రీతిలో వారికి సాయం అందిస్తాను అని స్పష్టం చేశారు.

Related posts