telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“టైటానిక్” హీరోను చూస్తూ ఆ పని… ప్రముఖ నటుడి సంచలన వ్యాఖ్యలు

Leonardo

టైటానిక్ హీరో లియోనార్డో డికాప్రియోను చూస్తూ కోరిక తీర్చుకునేవాడినంటూ తన గురించి తానే షాకింగ్ విషయాలు వెల్లడించాడు ప్రముఖ అమెరికన్ కమెడియన్. ‘టైటానిక్’ హీరో లియోనార్డో డికాప్రియో అంటే ఇష్టపడని అమ్మాయిలు ఉండరు. అయితే అమెరికాకు చెందిన ప్రముఖ కమెడియన్, నటుడు పీట్ డేవిడ్సన్ కు కూడా లియోనార్డో అంటే పిచ్చి ఇష్టం అంట. తనకు డికాప్రియో అంటే ఎంత ఇష్టమో వివరిస్తూ ఓ ఇంటర్వ్యూలో నిస్సిగ్గుగా తనకున్న చెడ్డ అలవాటుని వెల్లడించాడు. “నాకు డికాప్రియో అంటే చాలా ఇష్టం. అతనిపై క్రష్ ఉండేది. అతని యాక్టింగ్ అంటే ఇంకా ఇష్టం. నా రూంలో డికాప్రియో ఫొటోలు చాలా ఉండేవి. ఆ ఫొటోలు చూస్తూ హస్తప్రయోగం చేసుకునేవాడిని. టైటానిక్ సినిమా విడుదలైనప్పుడు నేను నాలుగో తరగతిలో ఉన్నాను. అప్పట్లో లియో లవ్ బుక్స్ అని తెగ అమ్ముడుపోయేవి. అవన్నీ కొనుక్కుని చదివేవాడిని. నేను రెండు సార్లు డికాప్రియోను కలిశాను. అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి సిగ్గుతో పరిగ్గెత్తుకుంటూ వెళ్లిపోయాను” అని వెల్లడించాడు పీట్.

Related posts