telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

విద్యాశాఖ అధికారులపై వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Alla

విద్యాశాఖ అధికారులపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, విద్యా శాఖ మంత్రి మంచి ఆశయంతో పని చేస్తున్నారని, విద్యాశాఖ అధికారుల పనితీరు మాత్రం అధ్వాన్నంగా ఉందని మండిపడ్డారు. విద్యాశాఖ అధికారులు నిద్రపోతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే ఆర్కే. మే నెలలో ప్రభుత్వ స్కూళ్లకు పుస్తకాలు కావాలని ఇండెంట్ పెడితే జనవరిలో పుస్తకాలు ఇచ్చారని ఆర్కే మండిపడ్డారు. పుస్తకాలు గతేడాది జూన్‌లో ఇవ్వాల్సి ఉంటే.. ఈ ఏడాది జనవరికి పుస్తకాలు పంపిణ చేయలేకపోయారని మండిపడ్డారు. జనవరిలో పుస్తకాలు వస్తే.. మార్చిలో జరిగే పరీక్షల్లో విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవుతారు.. ఎలా చదివి రాస్తారని ప్రశ్నించారు. తన నియోజకవర్గం మంగళగిరి మాత్రమే కాదు.. గుంటూరు జిల్లా మొత్తం ఇదే పరిస్థితి ఉందని మండిపడ్డారు. పుస్తకాలు ఆలస్యం కావడంపై వివరణ అడిగితే.. ప్రభుత్వం నుంచి మంచి పుస్తకాలే రాలేనది డీఈవో చెబుతున్నారని, ఇదంతా చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందన్నారు. విద్యాశాఖ అధికారుల పనితీరు బాగాలేదని, వచ్చే విద్యా సంవత్సరం సమయానికైనా.. సకాలాంలో విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేయాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి అధికారుల్ని కోరారు. మరి ఆర్కే విమర్శలపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Related posts