telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పేద సినీ కార్మికులకు కోటి విరాళం ఇచ్చిన కింగ్ నాగార్జున

Nagarjuna

కరోనా వైరస్ ప్రభావం కారణంగా దేశ వ్యాప్తంగా 21 రోజులపాటు లాక్‌డౌన్ విధించడంతో ఏప్రిల్ 14 వరకు ఇళ్లలో నుంచి ఎవ్వరూ బయటికి రావడానికి వీళ్లేదు. సినిమా షూటింగ్‌లు ఆగిపోవడం వల్ల ఆ ప్రభావం వాటి మీద ఆధారపడి బతికే సినీ కార్మికులపై పడింది. రోజువారీ వేతనానికి పనిచేసే చాలా మంది సినీ కార్మికులు ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారిని ఆదుకోవడానికి ఇప్పటికే చాలా మంది సినీ పెద్దలు విరాళాలు ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయల సహాయాన్ని ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు ఆయన బాటలోనే కింగ్ నాగార్జున నడిచారు. సినీ వర్కర్స్ సహాయార్థం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ లాక్‌డౌన్ మనకి అత్యంత అవసమని, అందరూ ఇంటిలోనే ఉండి విధిగా దాన్ని పాటించాలని పిలుపునిచ్చారు. అలాగే, దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి డి.సురేష్ బాబు, వెంకటేష్, రానా సంయుక్తంగా కోటి రూపాయలు ప్రకటించారు. క‌రోనా వ్యాప్తి నిరోధంలో నిరంత‌రం శ్రమిస్తోన్న వైద్య సిబ్బంది సంక్షేమం కోసం, సినిమా షూటింగ్‌లు నిలిచిపోవ‌డంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద క‌ళాకారులు, సినీ కార్మికుల సంక్షేమం కోసం సురేశ్ ప్రొడ‌క్షన్స్‌ తరఫున కోటి రూపాయ‌ల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.

Related posts