telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం విద్యా దీవెన: సీఎం జగన్

cm jagan on govt school standardization

ఏపీ సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ‘జగనన్న విద్యా దీవెన’ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల విద్యార్థులతో సీఎం వైఎస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. సంపూర్ణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తింప చేస్తున్నాం. ఎవరైనా తల్లిదండ్రులు కాలేజీలకు ఫీజ్ కడితే కనుక ఆ డబ్బును కాలేజీ యాజమాన్యాలు వెనక్కి ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ ఆదేశించారు.

బోర్డింగ్‌, లాడ్జింగ్‌ కోసం వసతి దీవెన, పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం విద్యా దీవెన అనే రెండు పథకాలను తీసుకోచ్చామని తెలిపారు. అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద రూ. 4 వేల కోట్లకు పైగా నిధులు విడుదల చేశారు. ఏమైనా సమస్యలుంటే విద్యార్థుల తల్లిదండ్రులు 1902 నంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు.

ఉన్నత విద్యా శాఖలో కాల్ సెంటర్ ఉంటుందని, దీనిపై సీఎం కార్యాలయం పర్యవేక్షిస్తుందని తెలిపారు. ఏ సమస్యలు ఉన్నా ప్రభుత్వం వెంటనే స్పందిస్తుందని చెప్పారు. తల్లిదండ్రులు వారి పిల్లలను గొప్పగా చదివించాలని అన్నారు. ‘దేవుడి దయతో మీకు మంచి జరగాలని కోరుకుంటున్నానని జగన్ అన్నారు.

Related posts