telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణకు రూ.15 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించిన కేజ్రీవాల్..

arvind-kejriwal

భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన తెలంగాణ రాష్ట్రంలో సహాయ, పునరావాస కార్యక్రమాల కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తమ రాష్ట్రం తరుఫున రూ.15 కోట్ల సాయాన్ని ప్రకటించారు. కష్ట సమయంలో తెలంగాణ రాష్ట్రానికి ఢిల్లీ పూర్తిగా అండగా ఉంటుందని వెల్లడించారు. ఢిల్లీ ప్రభుత్వ సహాయానికి స్పందిస్తూ సీఎం కేసీఆర్ ఇవాళ ఫోన్లో కేజ్రీవాల్ తో మాట్లాడారు. రూ.15 కోట్ల సాయం ప్రకటించినందుకు తెలంగాణ ప్రజల తరుపున కృతజ్ఞతలు తెలిపారు. ఎంతో ఉదారత చాటుకుని అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. కాగా ఇప్పటికే వరద బాధితులకు ఆదుకునేందుకు తమిళనాడు సీఎం పళనిస్వామి పది కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు. వరద బాధితులకు అండగా నిలిచి, ప్రభుత్వ సహాయక చర్యలకు అండగా ఉండేందుకు ఈ సహాయం ప్రకటించినట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు ఇచ్చిన పిలుపు మేరకు మేఘా ఇంజనీరింగ్, అండ్ ఇన్ఫ్రా సంస్థ (MEIL) వెంటనే స్పందించింది. సీఎం సహాయనిధికి (CMRF) పది కోట్ల రూపాయల విరాళం ప్రకటించింది. 

Related posts