కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తునే ఉంది. సెకండ్ వేవ్ వస్తుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నాయి ప్రభుత్వాలు. సెకండ్ వేవ్ లో అమెరికాలో విపరీతంగా కేసులు పెరుగుతున్నాయి. అయితే.. తాజాగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు కరోనా భయం పట్టుకుంది. ఇప్పటికే ఒకసారి కరోనా బారిన పడిన ఆయన, మళ్లీ మహమ్మారి సోకుతుందనే భయంతో స్వీయ నిర్భంధంలోకి వెళ్లారు. కరోనా బారిన పడిన ఓ వ్యక్తిని కలిసిన నేపథ్యంలో తాను స్వీయ నిర్భంధం లోకి వెళ్తున్నట్టు ప్రకటించారు. కొవిడ్-19 పాజిటివ్ అని పరీక్షల్లో తేలిన రోగి ప్రధానిని కలిసిన దృష్ట్యా బోరిస్ కు స్వీయ నిర్భంధం అవసరమని యూకే నేషనల్ హెల్త్ సర్వీస్ టెస్ట్ అండ్ ట్రేస్ ద్వారా తెలిపింది. దీంతో తనకు ఎలాంటి లక్షణాలు లేనప్పటికీ క్వారంటైన్‌లోకి వెళ్తున్నాని, నిబంధనల ప్రకారం 10 రోజుల పాటు ఇంటి నుంచే పరిపాలనను కొనసాగిస్తానని చెప్పారు. ఈ మేరకు ప్రధాని బోరిస్ జాన్సన్ ట్వీట్ చేశారు.
previous post
next post