telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

రష్యాలో కరోనా విజృంభణ…

corona mask

ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన కరోనా ప్రపంచాన్ని ఓ ఊపు ఊపి వెళ్ళిపోయినట్లే చేసింది. కానీ ఇప్పుడు మళ్లీ ప్రపంచంలో కరోనా తిరిగి విజృంభిస్తోంది. దీనిని అడ్డుకునేందుకు దేశాలు అనేక ప్రణాళికలను తెస్తోన్నాయి. అయినప్పటికీ ఈ మహమ్మారిని అదుపు చేయలేకపోతున్నాయి. రోజురోజుకు ప్రపంచ దేశాలను సవాల్ చేస్తూ కరోనా తన బాధితుల సంఖ్యను పెంచుతోంది. ఇటీవల రష్యాలో మరో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 24,822 కేసులు నమోదయ్యాయి. దీంతో నిన్నటి 24,318 కేసుల రికార్డును బద్దలు కొట్టింది. రష్యాలో కరోనా రికార్డు స్థాయిలో నమోదు కావడం ఇది వరుసగా మూడో రోజు. అయితే వీటిలో దాదాపు 5,816 మందికి ఎటువంటి లక్షణాలు లేవని అధికారులు తెలిపారు. వీటితో రష్యాలోని కరోనా కేసుల సంఖ్య 2,064,748కు చేరింది. గత 24 గంటల్లో 467 మరణాలతో దేశంలోని మరణాల సంఖ్య 35,778కి చేరింది. దాంతో పాటుగా 26,021 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీ రేటు 1,577,435కు చేరింది. చూడాలి మరి ముందు ముందు కేసులు పెరుగుతాయా… లేదా అనేది.

Related posts