telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మాజీ ఎంపీ రేణుకా చౌదరికి నాన్‌ బెయిలబుల్ వారెంటు

renuka chowdary fire on congress lead

ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకురాలు, మాజీ ఎంపీ రేణుకాచౌదరికి నాన్‌బెయిలబుల్‌ వారెంటు జారీ అయింది. ఆమెపై నమోదైన చీటింగ్ కేసు విషయంలో నోటీసులు జారీ చేసినా కోర్టుకు హాజరు కాకపోవడంతో ఖమ్మం జిల్లా రెండో అదనపు ఫస్ట్‌క్లాస్‌ కోర్టు న్యాయమూర్తి ఈ మేరకు ఈ సమన్లు జారీ చేసింది.

2014 ఎన్నికల్లో వైరా ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పిస్తానని తన భర్త రాంజీ నాయక్‌ నుంచి ఒక కోటి 30 లక్షల రూపాయలు రేణుకా తీసుకున్నారని కళావతి బాయి అనే మహిళ అప్పట్లో ఖానాపురం హవేలీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు గతంలో ఫిర్యాదు చేశారు. దీంతో రేణుకపై 420, 417 కింద కేసు నమోదైంది. విచారణలో భాగంగా కోర్టు ఇచ్చిన నోటీసులను రేణుకౌ చౌదరి తీసుకోకపోవడం, విచారణకు హాజరుకాకపోవడంతో కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది.

Related posts