కన్నడ స్టార్ యశ్ హీరోగా రూపొందుతున్న భారీ యాక్షన్ మూవీ “కెజిఎఫ్-2”. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ ప్యాన్ ఇండియా మూవీలో సంజయ్ దత్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. తెలుగులో వారాహి చలన చిత్రం వారు గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ చిత్రంలో యశ్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా..రవీనా టండన్ మరో కీలకపాత్ర పోషిస్తోంది. రవి బస్రూర్ సంగీతం సమకూర్చుతున్నారు. అన్నీ సక్రమంగా ఉండుంటే ఈ అక్టోబర్ 23న ‘కెజిఎఫ్-2’ విడుదల కావాల్సింది. కానీ కరోనా వైరస్ ప్రభావం ఎక్కువ కావడంతో షూటింగ్స్ దాదాపు ఆరు నెలల పాటు ఆగింది. ఈ మధ్య కాలంలో షూటింగ్‌లకు అనుమతులు లభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ‘కెజిఎఫ్-2’ యూనిట్ గురువారం షూటింగ్‌ను ప్రారంభించింది. ఈ విషయాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అయితే ఈ యూనిట్‌ను వేధిస్తున్న ప్రధాన సమస్య సంజయ్ దత్ ఆరోగ్యం. రీసెంట్‌గా లంగ్ క్యాన్సర్ బారిన పడిన సంజయ్ దత్ ట్రీట్‌మెంట్ తీసుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్‌లో సంజు బాబా పాల్గొనాల్సి ఉంది. కానీ ఆయన క్యాన్సర్ సమస్యతో బాధపడుతున్నారు. మరిప్పుడు యూనిట్ ఏం చేస్తుందో చూడాలి.
Let’s get it done!!!!#KGFCHAPTER2 https://t.co/pyDOK7B3Ib
— Prashanth Neel (@prashanth_neel) August 20, 2020