telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ, మహారాష్ట్ర ప్రయాణాలపై టీఎస్ ప్రభుత్వం నిషేధం

acb telangana

దేశవ్యాప్తంగా కరోనా కేసులు విజృంభిస్తున్నప్పటికీ అత్యధిక కోవిడ్-19 కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. మరోవైపు, ఏపీలో కేసుల సంఖ్య కొన్ని రోజులుగా భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ, మహారాష్ట్రకు తెలంగాణ వాసులెవరూ వెళ్లొద్దని ఆదేశించింది. ఈ మేరకు ఆ రాష్ట్రాలకు వెళ్లడంపై నిషేధం విధించింది. ఏపీ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న తెలంగాణ వాసులకు ఆ రాష్ట్రాలతో బంధుత్వాలు కూడా ఎక్కువగానే ఉంటాయి.

సరిహద్దుల్లో ఉన్నవారు వైద్య, ఇతర అత్యవసర పనులకు కూడా ఈ రాష్ట్రాలకు వెళ్తుంటారు. ఖమ్మం, నల్గొండ, జిల్లాల ప్రజలు గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలకు వెళ్తుంటారు. మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు కర్నూలుకు వెళ్తుంటారు. దీంతో, వీరి ప్రయాణాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. సరిహద్దు చెక్ పోస్టుల వద్ద బారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Related posts