దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో రికార్డుస్థాయిలో వానలు కురుస్తున్నాయి. భారీ వర్షానికి రహదారులన్ని జలమయం ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇక శుక్రవారం నుంచి ఏకదాటిగా కురుస్తున్న వర్షంతో 18 ఏళ్ల రికార్డు బద్దలయింది. 18 ఏళ్ల తర్వాత అత్యధిక వర్షపాతం నమోదైంది.
భారీ వర్షం కారణంగా ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. అండర్ పాస్ వంతెన వద్ద నీరు చేరడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ను నిలిపివేశారు. మరోపక్క, రాగల 12 గంటల్లో ఢిల్లీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్న వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
చేపపిల్లలను వదిలిన మంత్రి జగదీష్ రెడ్డి…