telugu navyamedia
వ్యాపార వార్తలు

వాట్సాప్ యూజ‌ర్ల‌కు గుడ్‌న్యూస్‌..

వాట్సప్… ఎవరికైనా క్షణాల్లో మెసేజ్ పంపడానికి ఉపయోగపడే ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్. స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరూ వాట్సప్‌ని (WhatsApp) ఉపయోగిస్తుంటారు. ఈమధ్య కాలంలో వాట్సాప్‌లో యూజర్‌ భద్రత గురించి బోలెడు అనుమానాలు బ‌య‌టకొచ్చాయి.ఫేస్‌బుక్‌ స్వయంగా వాట్సాప్‌ యూజర్ల డాటాపై కన్నేసిందన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అయితే మెసేజెస్ ఎండ్‌-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ భద్రతతో చాలా సురక్షితంగా ఉంటాయని ఆ సంస్థ చెబుతోంది. ఈ తరుణంలో యూజర్ల కోసం ఓ గుడ్‌న్యూస్‌ చెప్పింది వాట్సాప్‌.

ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ ద్వారా యూజర్‌ చాట్‌ డాటాకు భద్రత భరోసా ఇస్తున్న వాట్సాప్‌.. ఇప్పుడు మరో ప్రైవసీ అప్‌డేట్‌ ఇచ్చింది. చాట్‌ బ్యాకప్‌ల విషయంలోనూ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ వర్తిస్తుందని ప్రకటించింది. ‘‘ఒకవేళ ఎవరైనా వాట్సాప్‌ హిస్టరీని బ్యాక్‌ అప్‌ చేసినప్పుడు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ కోరుతుంది. అది కేవలం వాళ్లకు మాత్రమే కనిపిస్తుంది. సంబంధిత డ్రైవ్‌లోని సమాచారాన్ని ఎవరూ అన్‌లాక్‌ చేయలేరు’’ వెల్లడించారు.

WhatsApp won't limit functions if you don't accept new policy terms | Business Standard News

అయితే సంబంధిత డ్రైవ్‌ల్లో(ఐక్లౌడ్స్‌ లేదంటే గూగుల్‌ డ్రైవ్‌) ‘ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ కీ’ సాయంతో యాసెస్‌కి అనుమతి ఉంటుంది. మరికొద్ది రోజుల్లోనే ఈ ఫీచర్‌ యూజర్‌కు అందుబాటులో రానుంది. అయితే ఇక్కడో ట్విస్ట్‌ ఏంటంటే.. ఇది డిఫాల్ట్‌గా ఆన్‌ కాదు. పాస్‌వర్డ్‌ని క్రియేట్‌ చేసుకోవడం గానీ, 64 డిజిట్‌ ఎన్క్రిప్షన్ కీ మీద యూజర్‌ ఆధారపడాల్సి ఉంటుంది. ఒకవేళ పాస్‌వర్డ్‌ గనుక మర్చిపోతే.. అకౌంట్‌ రికవరీకి వాట్సాప్‌​ కూడా ఎలాంటి సాయం అందించలేదు. ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ల మందికి పైగా వాట్సాప్‌ను ఉపయోగిస్తుండగా అంచ‌నా..

Related posts