శాంసంగ్ సంస్థ సరికొత్త గెలాక్సీ ఎస్10 సిరీస్ ఫోన్లను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్లు ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌లో వినియోగదారులకు లభిస్తున్నాయి. ఈ క్రమంలో గెలాక్సీ ఎస్10 సిరీస్ ఫోన్లను ఈ నెల 8వ తేదీ నుంచి దేశంలోని అన్ని రిటెయిల్ ఔట్‌లెట్లలో విక్రయించనున్నారు. కాగా శాంసంగ్ అన్‌లైన్ షాప్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో ఇప్పటికే ఈ ఫోన్లకు ప్రీ ఆర్డర్లను ప్రారంభించారు. ఈ క్రమంలో మరో రెండు రోజుల్లో ఆఫ్‌లైన్‌లోనూ ఈ ఫోన్లు వినియోగదారులకు లభిస్తాయి.
ఈ ఫోన్ల ధరల వివరాలు ఇలా ఉన్నాయి :
* శాంసంగ్ గెలాక్సీ ఎస్10ఇ – 6జీబీ+128జీబీ – రూ.55,900
* శాంసంగ్ గెలాక్సీ ఎస్10 – 8జీబీ+128జీబీ – రూ.66,900
* శాంసంగ్ గెలాక్సీ ఎస్10 – 8జీబీ+512జీబీ – రూ.84,900
* శాంసంగ్ గెలాక్సీ ఎస్10ప్లస్ – 8జీబీ+128జీబీ – రూ.73,900
* శాంసంగ్ గెలాక్సీ ఎస్10ప్లస్ – 8జీబీ+512జీబీ (సెరామిక్ బ్లాక్) – రూ.91,900
* శాంసంగ్ గెలాక్సీ ఎస్10ప్లస్ – 12జీబీ+1 టీబీ (సెరామిక్ వైట్) – రూ.1,17,900
వ్యభిచారం తప్పుకాదు… శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు