telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

మారుతి సుజుకి .. బంపర్ ఆఫర్ .. బాలెనో పై లక్ష డిస్కౌంట్..

1lakh discount on maruti baleno car

మారుతి సుజుకి పండుగ సందర్భంగా బాలెనో ఆర్.ఎస్ కారు ధర భారీగా తగ్గించడం జరిగింది. ఏ వెహికల్ ధర అయినా సరే 10 నుండి అత్యధికంగా 50 వేల వరకు తగ్గే అవకాశం ఉంది, కాని మారుతి బాలెనో మాత్రం లక్ష వరకు తగ్గించారట. ఈ వెహికల్ 7.89 లక్షల ఎక్స్ షో రూం ప్రైజ్ తో వస్తుంది. కేవలం ఈ తగ్గింపు ధరలు పండుగ సమయాల్లోనే అని తెలుస్తుంది. ఫెస్టివల్ సీజన్ లో మారుతి తమ వెహికల్స్ సేల్స్ పెంచుకోవాలనే ఉద్దేశంతో బాలెనో ధర భారీగా తగ్గించారు.

బి.ఎస్ 6 వెహికల్స్ రాబోతున్న కారణంగా బి.ఎస్ 4 నామ్స్ తో వచ్చిన వెహికల్స్ స్టాక్ క్లియర్ చేసే పనిలో ఉన్నారు. మారుతి సుజుకి నుండి వచ్చి ఈమధ్య కాలంలో సక్సెస్ అయిన వెహికల్ బాలెనో. 1.0 లీటర్ బూస్టర్ జెట్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తున్న ఈ వెహికల్ 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ తో వస్తుంది. 102 బి.హెచ్.పి పవర్, 150 ఎన్.ఎం టార్క్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. మరి ఈ ఫెస్టివల్ సీజన్ సేల్ కోసం మారుతి సుజుకి వేసిన ఈ ప్లాన్ సేల్స్ మీద ఎంతవరకు ప్రభావితం చూపిస్తుందో చూడాలి.

Related posts