telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

ఫ్లిప్‌కార్ట్ … బిగ్ బిలియన్ డేస్ సేల్‌ …

flipkart big billion sale from tonight

నేడు ఫ్లిప్‌కార్ట్ తన సైట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను ప్రారంభించింది. నిన్న రాత్రి 8 గంటల నుంచే ఈ సేల్ ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు అందుబాటులోకి రాగా రేపటి నుంచి స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, ఎలక్ట్రానిక్స్, యాక్ససరీలపై ఆఫర్లను అందివ్వనున్నారు. ఇక ఈ రోజు రాత్రి నుంచి ఈ ప్రొడక్ట్స్‌పై ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు ఆఫర్లను అందివ్వనున్నారు. బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో టీవీలు, స్మార్ట్ హోం డివైస్‌లు, సౌండ్ బార్స్, స్మార్ట్ వియరబుల్స్ తదితర అనేక ఉత్పత్తులపై ఆకట్టుకునే ఆఫర్లను, రాయితీలను అందిస్తున్నారు.

ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులు, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులతో 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. అనేక ఉత్పత్తులను నో కాస్ట్ ఈఎంఐ విధానంలో కొనుగోలు చేసే సౌలభ్యాన్ని అందిస్తున్నారు. కాగా ఈ సేల్ అక్టోబర్ 4వ తేదీ వరకు కొనసాగనుంది.

Related posts