కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో గాంధీ ఆస్పత్రి జనరల్ మెడిసిన్ హెచ్‌వోడీ వినయ్ శేఖర్ పలు సూచనలు చేశారు. కరోనా బాధితుడు దగ్గినా, తుమ్మినా వచ్చే తుంపర్లతో వైరస్ ఇతరులకు సోకుతుందని తెలిపారు. మనిషికి మధ్య సోషల్ డిస్టెన్స్ పాటించడమే కరోనాకు మందు అని తెలిపారు. ఏసీ వాడకానికి కొన్నాళ్లు దూరంగా ఉండటం మంచిదని చెప్పారు.
చేతులు శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యమని, ఇతర జబ్బులు ఉన్నవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పోషకాహారం తీసుకోవాలని చెప్పారు. నాన్ వెజ్ తినవచ్చుని, ఇది చాలా మంచిదని హితవుపలికారు. ఆల్కహాల్ బేస్‌డ్ శానిటైజర్ వాడితే ఉపయోగమని వినయ్ శేఖర్ పేర్కొన్నారు.
భయంతోనే చంద్రబాబు సైలెంట్: విజయసాయిరెడ్డి