telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

నిబంధనలను ఉల్లంఘించిన 66 సంస్థల సీజ్‌!

ghmc hydeerabad

కరోనా వైరస్‌ వ్యాప్తిని నిర్మూలించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఆదేశాల మేరకు  తెలంగాణ ప్రభుత్వం మార్చి 31వ తేదీ వరకూ విద్యాసంస్థలు, మ్యూజియంలు, పబ్‌లు, సినిమాధియేటర్లు, జిమ్నాజియంలు, బార్‌లు తదితర వాటిని మూసి వేయాలని ఆదేశించింది. ఈ నేపధ్యంలో ప్రభుత్వ ఆదేశాలను భేఖాతర్‌ చేస్తూ నిర్వహిస్తున్న 66 సంస్థలను జీహెచ్‌ఎంసి ఏర్పాటుచేసిన ప్రత్యేక తనిఖీ బృందాలు సీజ్‌చేశాయి.

అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, స్పోర్ట్స్‌ ఈవెంట్స్‌, కాన్ఫరెన్స్‌లు, వర్క్‌షాప్‌ల వంటి వాటినికూడా ఈనెల 21వ తేదీ వరకూ రద్దుచేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసింది. ప్రభుత్వఆదేశాలను ఖచ్చితంగా అముచేసేందుకు జీహెచ్‌ఎంసిలోని విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అండ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం ఆధ్వర్యంలో 18 ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. ఈ బృందాలు గ్రేటర్‌ పరిధిలోని ఆయా సంస్థలను తనిఖీ చేస్తున్నాయి.

Related posts