తెలంగాణ మంత్రి కేటీఆర్ కు రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేటీఆర్ తెలంగాణ యువతకు ఐకన్ అని అన్నారు. రాష్ట్రాన్ని ఐటీ ఎగుమతుల్లో నెంబర్ వన్ చేశారన్నారు. టీఎస్ ఐపాస్ తీసుకొచ్చి ప్రపంచంలోనే ఉత్తమమైన ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చారని అన్నారు.
పురపాలక శాఖామాత్యులుగా మున్సిపాలిటీలను, కార్పోరేషన్లను అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులుగా దేశంలోనే అత్యధిక పార్టీ కార్యకర్తలు కలిగిన తిరుగులేని శక్తిగా టిఆర్ఎస్ ను మలిచారని తెలిపారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్న ఆయన పది కాలాలపాటు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.