telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

ఎత్తు కాదు, నాలిక పెరిగిపోతుంది.. తరుణోపాయం..

tongue growth day by day to a boy

ఎత్తు పెరగాలని బాధపడేవాళ్లు ఇప్పటికి చాలా మంది ఉన్నారు. అయితే అసాధారణంగా ఎత్తుగానో, పొట్టిగానో ఉండిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ సమస్య ఎత్తుతోనే కాదు, వెడల్పుతో కూడా ఉంది. అందుకే చాలా మంది సన్నగా ఉన్నాం.. లావుకావాలి అనుకుంటారు; ఇంకొందరు లావుగా ఉన్నాను.. సన్నబడాలి అనుకుంటారు. వీరికి కూడా అసాధారణ ఆరోగ్య సమస్యలు ఉండి అలా ఉండవచ్చు. సాధారణ సమస్యలు చాలా ఉండటం అందరికి తెలిసిందే. ఇక అసాధారణ సమస్యలు తలెత్తితే .. దానికి ఎక్కడకు పరిగెట్టాలో కూడా తెలియదు. వైద్యులు కూడా పరీక్షలు చేసి ఏదనేది పూర్తిగా అవగాహనకు వస్తే తప్ప ఇలాంటివాటికి మందులు సూచించరు. అయితే ఇలాంటి అసాధారణ సమస్యలు ఏళ్లతరబడి ఉంటే, ఆ బాధ చెప్పేది కాదు. అలాంటి అసాధారణ సమస్యతో బాధపడేవాళ్లు కూడా ఈ ప్రపంచంలో లేకపోలేదు.

ఎక్కడో ఎందుకు ఈ బాలుడు కూడా అలాంటి సమస్యతోనే బాధపడుతున్నాడు. ఒకటి, రెండు కాదు ఏకంగా పన్నెండేళ్లుగా ఈ చిన్నారి సరైన భోజనం చేయలేక ఇబ్బంది పడుతున్నాడు. నాలుక నానాటికీ అసాధారణంగా పెరుగుతూ ఉండటంతో ఘనాహారాన్ని భుజించలేక, కేవలం ద్రవ పదార్థాన్నే తీసుకుంటున్నాడు. వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలం క్యాద్గిరకు చెందిన మోహన్‌(12)కు పసితనం నుంచే నాలుక పెరగడం మొదలయింది. నోట్లోంచి బయటికి వచ్చిన నాలుక పరిమాణం ఇంకా పెరుగుతూనే ఉంది. ఖరీదైన వైద్యం చేయించాలని సూచించడంతో.. అంత స్థోమత లేక తల్లిదండ్రులు కమలమ్మ, చంద్రశేఖర్‌ మిన్నకుండిపోయారు. కొందరు గ్రామస్థులు 1098 చైల్డ్‌లైన్‌కు సమాచారం అందించారు. స్పందించిన చైల్డ్‌లైన్‌ ప్రతినిధి హన్మంతరెడ్డి శుక్రవారం గ్రామానికి చేరుకొని, బాలుడిని తహసీల్దార్‌ ఉమామహేశ్వరి వద్దకు తీసుకొచ్చారు. బాలుడి పరిస్థితిని చూసిన ఆమె.. ఉన్నతాధికారులకు వివరించి వైద్యంచేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Related posts