రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం వైఎస్ జగన్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. సీఎం జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, మర్గాని భరత్, నందిగం సురేశ్, రఘురామకృష్ణంరాజు, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు.
రాష్ట్ర అభివృద్ధి, తదితర అంశాలపై ఈ సమావేశం సాగనుంది. ఈ భేటీ అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు కేంద్ర న్యాయ, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌తో సీఎం వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. అలాగే మధ్యాహ్నం మూడు గంటలకు బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం వైఎస్ జగన్ భేటీ అవుతారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా.. తెలంగాణ స్కూళ్లలో అధిక ఫీజులు: లక్ష్మణ్