telugu navyamedia
రాజకీయ వార్తలు

పెట్టుబడులు రాబట్టేందుకు ప్రణాళికతో పనిచేయాలి: మోదీ

narendra-modi

కరోనా సంక్షోభం నేపథ్యంలో చైనాలో కార్యకలాపాలను కొనసాగించేందుకు ప్రముఖ కంపెనీలు విముఖత వ్యక్తం చేస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. ఇదే విషయం నిన్నటి వీడియో కాన్ఫరెన్స్ లో భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రస్తావించిన విషయం తాజాగా వెల్లడైంది. చైనా నుంచి అనేక కంపెనీలు నిష్క్రమించే అవకాశాలు కనిపిస్తున్నాయని, అక్కడి నుంచి వచ్చేస్తున్న కంపెనీలను ఆకర్షించేందుకు సీఎంలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

కరోనా సంక్షోభం ముగిసిన తర్వాత చైనా వెలుపల అవకాశాలను అన్వేషించేందుకు అనేక కంపెనీలు ప్రయత్నిస్తాయని తెలిపారు. ఇలాంటి సంస్థల నుంచి రాష్ట్రాలకు భారీగా పెట్టుబడులు రాబట్టేందుకు మనందరం ఓ సమగ్ర ప్రణాళికతో పనిచేయాల్సి ఉంటుందని వివరించారు. చైనాకు ప్రత్యామ్నాయంగా నిలిచే క్రమంలో రాష్ట్రాలు పుష్కలమైన మానవవనరులు, నైపుణ్య, మెరుగైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

Related posts