క్రైస్తవ మిషనరీలు విద్య, వైద్య రంగంలో ఎనలేని కృషి చేస్తున్నాయని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. హైద్రాబాద్ బంజారాహిల్స్‌లో బిషప్‌లు, క్రైస్తవ ప్రముఖులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ అనేక పేద దేశాల్లో క్రైస్తవ మిషనరీలు అందిస్తున్న సేవలు మరువలేనివని అన్నారు. ఎక్కడ విపత్తులు సంభవించినా సేవలు అందించడానికి క్రైస్తవ సమాజం ముందు ఉంటుందన్నారు.
రాష్ర్టంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. స్వరాష్ర్టంలో పల్లెలు, పట్టణాలు అభివృద్ధి చెందాయన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని చెప్పారు. రాష్ర్టంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ విద్యార్థుల కోసం 940 గురుకులాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, రాష్ర్ట ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ పాల్గొన్నారు.
ఇసుక కొరతను ప్రభుత్వమే సృష్టించింది: కన్నా