పుల్వామా దాడితో భారత్-పాక్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడైనా ఇరుదేశాల మధ్య యుద్దవాతావరణం ఏర్పడే పరిస్థితులే ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఇక పాక్ ప్రధాని ఈ ఘటనపై చేసిన నిర్లక్ష్యపు స్పందన ఇంకాస్త వేడి పెంచిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో సైన్యాధికారులతో పాక్ ప్రధాని ఇమ్రాన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇమ్రాన్ అధ్యక్షతన పాకిస్థాన్ భద్రతా మండలి (ఎన్ఎస్‌సీ) సమావేశమైంది. పాక్‌లోని త్రివిధ దళాధిపతులు, భద్రత-నిఘా వర్గాల చీఫ్‌లు, కేంద్ర ఆర్థిక, రక్షణ, విదేశాంగ, అంతర్గత భద్రత వ్యవహార శాఖల మంత్రులు హాజరయ్యారు.
ఈ సందర్బంగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. భారత్ నుంచి ఎదురయ్యే ఎటువంటి దాడినైనా సమర్థంగా ఎదుర్కోవాలని, దీటుగా.. సమగ్రంగా బదులివ్వాలని ఆదేశించారు. పుల్వామా ఘటనను ఓ సంఘటనగా మాత్రమే పేర్కొన్న ఎన్ఎస్‌సీ.. ఆ దాడితో తమకు ఎంత మాత్రమూ సంబంధం లేదని మరోమారు తేల్చి చెప్పింది.
రాజకీయ లబ్ధి కోసమే పోలీసు శాఖపై నిందలు: హోం మంత్రి సుచరిత