telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

బస్సులతో .. గిన్నిస్ రికార్డు..

Guinness record with bus parade

గిన్నిస్ బుక్ లో చోటు కోసం ఎందరో ఎన్నోవిధాలుగా ప్రయత్నిస్తుంటారు. అలాగే ఒక ప్రభుత్వ రంగ సంస్థ కూడా తన వంతు ప్రయత్నం చేసి సాధించింది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గిన్నీస్‌బుక్‌ వరల్డ్‌ రికార్డ్‌ దిశగా అడుగువేసింది. కంట్రీస్‌ లాంగెస్ట్‌ బస్‌ పరేడ్‌ను నేడు ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించింది. నవాబ్‌గంజ్‌-సోరాన్‌ మార్గంలో 3.2 కిలోమీటర్ల మేర కాషాయ రంగుతో కూడిన 500 బస్సులను కుంభమేళా లోగోతో పరేడ్‌గా కొలువుదీర్చింది. మొత్తం 18 డివిజన్ల నుంచి బస్సులు, సిబ్బంది ఈ పరేడ్‌లో పాల్గొన్నారు. 10 నుంచి 12 మీటర్ల వ్యత్యాసంతో గంటకు 15 కిలోమీర్ల వేగంతో బస్సులు పరేడ్‌లో పాల్గొన్నాయి.

ఈ చర్యతో యూపీఎస్‌ఆర్టీసీ, ప్రయాగ్‌రాజ్‌ ప్రపంచపటంపై నిలుస్తాయని ప్రయాగ్‌రాజ్‌ డివిజన్‌ రీజినల్‌ సర్వీస్‌ మేనేజర్‌ ఎస్పీ సింగ్‌ తెలిపారు. గతంలో ఈ రికార్డు యూనైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ పేరుమీదుగా ఉంది. యూపీఎస్‌ఆర్టీసీ చేపట్టిన ఈ ఫ్లీట్‌ను గిన్నీస్‌బుక్‌ వరల్డ్‌ రికార్డ్స్‌కు చెందిన 70 మంది పరిశీలకులు గమనిస్తున్నారు.

Related posts