telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మేనిఫెస్టోలోని అన్ని హామీలను నెరవేర్చుతాం: కేసీఆర్‌

Woman candidates kcr cabinet Telangana

మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను నెరవేర్చుతామని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. నాలుగోరోజు అసెంబ్లీ సమావేశాల్లో ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ప్రవేశ పెట్టారు. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి దాన్ని బలపరిచారు. అనంతరం కాంగ్రెస్ శాసనసభ్యులు గండ్ర వెంకట రమణారెడ్డి, మజ్లిస్ శాసనసభ్యులు బలాల, బీజేపీ నుంచి రాజాసింగ్ చర్చలో పాల్గొన్నారు.

ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ మట్లాడారు. ఐదేళ్ల కాలంలో పూర్తి చేయాల్సి హామీలపై ఇప్పటినుంచి ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయొద్దని సూచించారు. రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. రైతుల అభివృద్ధే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.గత ప్రభుత్వ కాలంలో రూ.17 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేశామని, ఈ ప్రభుత్వ హయాంలో రూ.24 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తామని వెల్లడించారు. ఈ విషయంపై విధివిధానాల రూపకల్ప జరుగుతోందని తెలిపారు.

Related posts