telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

దేశంలో 71 లక్షలు దాటిన కరోనా కేసులు..

భారత్ లో కరోనా విజృంభణ కొనసాగుతూనే వుంది. ప్రతి రోజు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే వున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన నిబంధనలు అమలు చేసిన కేసుల సంఖ్య తగ్గడం లేదు. ఇప్పటికే దేశంలో 71 లక్షలు దాటింది కరోనా కేసుల సంఖ్య. కరోనా తో ఇప్పటివరకు 1.09 లక్షల మంది మృతి చెందారు. ఇక గడచిన 24 గంటల్లో 55,342 “కరోనా” పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే గడిచిన 24 గంటల్లో 706 మంది కరోనా తో మృతి చెందారు. తాజా కేసులతో దేశవ్యాప్తంగా 71,75,881 కి చేరాయి కరోనా కేసులు.

ఇక దేశంలో మొత్తం 1,09,856 మంది కరోనా తో మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 8,38,729 యాక్టివ్ కేసులున్నాయి. అలాగే 62,27,296 మంది కరోనా ను జయించి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న ఒక్కరోజే “కరోనా” నుంచి కోలుకున్న 71,760 మంది బాధితులున్నారు. ఇది ఒక శుభ పరిణామం. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 86.36 శాతంగా ఉండగా.. “యాక్టివ్” కేసులు12.10 శాతంగా ఉంది. మరణాల రేటు దేశవ్యాప్తంగా 1.53 శాతంగా నమోదైంది.

Related posts