పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ తో రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఆ తరువాత ఆయన డైరెక్టర్ క్రిష్‌తో తెరకెక్కే భారీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. పవన్ పుట్టినరోజున ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. పీరియాడికల్ జోనర్‌లో తెరకెక్కబోయే ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు బందిపోటు, గజదొంగ, ఓం శివమ్.. ఇలాంటి టైటిల్స్ పరిశీలనలోఉన్నట్లు వార్తలు వినిపించాయి. ఆ తర్వాత సినిమా పేరు ఓం శివమ్ అని, హరహర వీరమల్లు ఫైనల్ అయిందని, ఈ పేరును రిజిస్టర్ కూడా చేయించారని టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు మరో పేరు ప్రచారంలోకి వచ్చింది. పవన్- క్రిష్ సినిమాకి మరో పవర్ ఫుల్ పేరును ఫిక్స్ చేశారని, చిత్రానికి హరహర మహాదేవ్ అనే పేరును ఖరారు చేశారని, ఈ పేరును రిజిస్టర్ చేయించేశారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పవన్ సినిమాకి అనేక పేర్లు ప్రచారం అవుతున్నాయి. అతి త్వరలోనే చిత్ర యూనిట్ సినిమా పేరుపై ఓ క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.
previous post