telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కియారా ఉద్దేశ‌పూర్వకంగా ముక్కుపై కొట్టింది… వరుణ్ ధావన్ కామెంట్స్

varun

బాలీవుడ్ హీరో వ‌రుణ్ ధావ‌న్ తన ముక్కు మీద కియారా అద్వానీ ఉద్దేశ‌పూర్వకంగా కొట్టింద‌ని చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఏబీసీడీ 2 సినిమాలోని “స‌న్ సాతియా” సాంగ్‌ రిహార్స‌ల్‌లో భాగంగా ఇది జ‌రిగింద‌ని చెబుతూ వీడియోని ప్రూఫ్‌గా త‌న సోష‌ల్ మీడియా పేజ్ ద్వారా పోస్ట్ చేశాడు. వీడియోలో వ‌రుణ్ ధావ‌న్, కియారా అద్వానీలు సాంగ్‌కి అనుగుణంగా నాన్‌స్టాప్ డ్యాన్స్ చేశారు. ఓ సంద‌ర్భంలో కియారా.. వ‌రుణ్‌ని ముక్కుపై కొట్టింది. ఈ విష‌యాన్ని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా తెలిపాడు వ‌రుణ్‌. కొద్ది గంట‌ల‌లోనే ఈ వీడియో ఫుల్ వైర‌ల్‌గా మారింది. ఒరిజిన‌ల్ సాంగ్‌లో వరుణ్ ధావ‌న్, శ్ర‌ద్ధా క‌పూర్ క‌లిసి డ్యాన్స్ చేసిన విష‌యం తెలిసిందే.

Related posts