telugu navyamedia
క్రీడలు వార్తలు

మహిళలు ఐపీఎల్ ఎప్పుడో ప్రకటించిన బీసీసీఐ…

ఈ ఏడాది మార్చి 29న జరగాల్సిన పురుషుల ఐపీఎల్ కరోనా కారణంగా వాయిదా పడి సెప్టెంబర్ 19 న యూఏఈ వేదిక ప్రారంభమైంది. ఈ లీగ్ ఫైనల్ మ్యాచ్ నవంబర్ 10న జరుగుతుంది. అయితే ఎప్పుడైనా పురుషుల ఐపీఎల్ చివరి దశలో మహిళల ఐపీఎల్ ఛాలెంజర్ సిరీస్ ని బీసీసీఐ నిర్వహిస్తుంది. అయితే ఈ రోజు మహిళలు ఐపీఎల్ తేదీలను తెలిపింది బీసీసీఐ. నవంబర్ 4 నుండి 9 వరకు యూఏఈ వేదికగా మహిళల ఐపీఎల్ జరుగుతుంది అని ట్విట్టర్ వేదికగా బీసీసీఐ ప్రకటించింది. ఇక గత సీజన్ లో ఈ లీగ్ లో కేవలం 3 జట్లు మాత్రమే పాల్గొన్నాయి. కానీ ఈ ఏడాది మాత్రం 4 జట్లతో ఈ లీగ్ నిర్వహించనున్నట్లు దాదా చెప్పారు. కానీ ప్రస్తుత పరిస్థితుల కారణంగా 3 జట్లతోనే బీసీసీఐ మినీ ఐపీఎల్ నిర్వహిస్తుంది. ఈ మూడు జట్లకు హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధనా, మిథాలీ రాజ్ న్యాయకత్వం వహించనున్నారు. కానీ మహిళలు యూఏఈ కి ఎప్పుడు వెళ్తారు అనే విషయం ఇంకా తెలియదు.ఇక పురుషుల ఐపీఎల్ లో ఆటగాళ్లు ఏ విధమైన కరోనా నియమాలు పాటిస్తున్నారో మహిళల ఐపీఎల్ లో కూడా ప్లేయర్స్ అవే నియమాలు పాటించాలి.

Related posts