నిజాయతీగా పన్నులు చెల్లించేవారే జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధాన నరేంద్ర మోదీ అన్నారు. వారికి లబ్ధి చేకూర్చడం కోసం పారదర్శక పన్నుల విధాన వేదిక తీసుకువచ్చామని వెల్లడించారు. పన్ను చెల్లింపుదారుడు అప్పీళ్లకోసం నేరుగా అధికారుల ఎదుట హాజరవనవసరంలేని పేర్కొన్నారు.
‘ముఖ రహిత’ సరళతర పన్నుల వ్యవస్థ ట్యాక్స్ చెల్లింపుదారుడికి ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని అన్నారు. దేశంలో పన్నుల సంస్కరణ పరంగా ఈ పారదర్శక పన్నుల విధాన వేదిక ఎంతో ముఖ్యమైన పరిణామం అని పేర్కొన్నారు. ఈ సరికొత్త విధానం దేశ పౌరులందరికీ సెప్టెంబరు 25 నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించారు.
ప్రచారానికి డబ్బులు లేవు .. కిడ్నీ అమ్ముకుంటా