telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే

ys jagan cm

నివర్‌ తుఫాను ప్రభావం ఏపీపై ఎక్కువగానే చూపింది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్‌.. ఇవాళ ఏరియల్‌ సర్వే నిర్వహించనున్నారు. ఉదయం తొమ్మిది గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి సీఎం జగన్‌ బయలు దేరారు. హెలికాప్టర్‌లో కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో జరిగిన పంట నష్టాన్ని పరిశీలించనున్నారు సీఎం జగన్‌. అనంతరం 11 గంటల 45 నిమిషాలకు తిరుపతిలో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. 12 గంటల 45 నిమిషాలకు తిరిగి గన్నవరం పయనం అవుతారు సీఎం జగన్‌. కాగా..పంట నష్టాన్ని వచ్చే నెల 15వ తేదీలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం వైఎస్ జగన్.. డిసెంబర్‌ నెలాఖరులోగా నష్ట పరిహారం అందించాలని స్పష్టం చేశారు.. నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలు అందించాలని సూచించిన ఆయన.. ఎన్జీఆర్ఎఫ్ నిబంధనల ప్రకారం మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలన్నారు. పునరావాస శిబిరాల్లో ఉన్న వారికి నిబంధనల మేరకు ఆర్ధిక సాయం అందించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

Related posts