telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన గూగుల్…

google logo

కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ట్రెండ్ పెరిగింది. దీనివల్ల ఆయా సంస్థలకు ఉద్యోగుల ఖర్చు భారీగా తగ్గింది. కరోనా నేపథ్యంలో గతేడాదిగా ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ కంపెనీలు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ఇస్తున్న విషయం తెలిసిందే. ఏడాది కాలంలో దాదాపు రూ. 100 కోట్ల డాలర్లు ఆదా అయినట్లు గూగుల్ వెల్లడించింది. అయితే ఇప్పుడు గూగుల్ కంపెనీ కరోనా కాలంలో ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెపింది.  కరోనా కాలంలో కూడా ఉద్యోగులు ఆఫీస్ కు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు.  దీని వలన వచ్చే ఇబ్బందులను గుర్తించిన గూగుల్ ఓ నిర్ణయం తీసుకుంది.  వారంలో మూడు రోజులు ఆఫీస్ కు వచ్చి పనిచేయాలని, మిగిలిన రెండు రోజులు మీ ఇష్టం అని, ఆఫీస్ కు రావాలని అనిపిస్తే రావొచ్చని, లేదంటే ఇంటి నుంచే పనిచేయొచ్చని పేర్కొన్నది.  ఆఫీస్ కి వచ్చే మూడు రోజులు కూడా ఇంటి నుంచే పనిచేయాలని అనుకునే ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చని, వారి అప్లికేషన్ ను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని గూగుల్ తెలిపింది.

Related posts