ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ సభ్యులతో అసెంబ్లీ ఆవరణలో ఓ మీడియా ప్రతినిధి వాగ్వాదానికి దిగారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడు మాట్లాడుతుండగా మీడియా ప్రతినిధి అడ్డుతగిలారు. దీంతో బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ విలేఖరులు కూడా రాజకీయాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.సీఎం జగన్ రాజీనామాను మేం కోరుకోవడం లేదన్నారు. వారు చాలెంజ్ చేశారు కాబట్టే అడుగుతున్నామని అన్నారు. సీఎం జగన్ ప్రతిపక్షాలకు గౌరవం ఇవ్వాలని అన్నారు. రికార్డులు తీస్తే ఎవరు రౌడీలో, ఎవరు హంతకులో తెలుస్తుందని బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు.
వకీల్ సాబ్ పై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు…