telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“సైరా” దర్శకుడితో పవన్ ?

Pawan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శ్రీరామ్ వేణు దర్శకత్వంలో పింక్ రీమేక్ చిత్రం “వకీల్ సాబ్”లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇంకా కొంత షూటింగ్ బ్యాలన్స్ ఉంది. ఇక దీని తర్వాత పవన్ అధికారికంగా మరో రెండు ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. ఇప్పుడు ఈ మూడు సినిమాల తర్వాత చెయ్యబోయే సినిమా పై మాత్రమే అనేక కథనాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి చాలామంది దర్శకుల పేర్లే వినిపించినా మొత్తం ముగ్గురు టాప్ దర్శకుల పేర్లు వినిపిస్తుండడం గమనార్హం. మొదటగా పవర్ స్టార్ క్రేజీ కాంబో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పేరు వినిపించగా, ఆ తర్వాత మరో ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్ పేరు వినిపించింది. ఇక ఇప్పుడు మరో టాప్ దర్శకుడు సురేందర్ రెడ్డి పేరు గట్టిగా విన్పిస్తోంది. మరి పవన్ ఎవరితో సినిమా ఓకే చేస్తారో చూడాలి.

Related posts