telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మరోసారి బోల్డ్ రోల్ లో ఇషా రెబ్బ

esha-rebba

ఇటీవలే కాలంలో డిజిటల్ రంగం ఏ స్థాయిలో అభివృద్ధి చెందిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా వెబ్ సిరీస్ లకు మంచి డిమాండ్ ఏర్పడడంతో ఇప్పటికే చాలామంది హీరోయిన్లు వెబ్ సిరీస్ లకు గ్రీన్ సిగ్నల ఇచ్చారు. ఈ జాబితాలో తెలుగమ్మాయి ఇషా రెబ్బా కూడా చేరిపోయింది. హిందీలో హిట్ అయిన “లస్ట్ స్టోరీస్” రీమేక్ వెబ్ సిరీస్ లో ఇప్పటికే నటిస్తోంది ఇషా. తాజాగా ఇప్పుడు మళ్ళీ అదే తరహాలో ఒక డార్క్ రోల్ లో ఈషా కనపడనున్నట్టు తెలుస్తుంది. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది చేస్తున్న ఓ వెబ్ సిరీస్ లో ఇషా రెబ్బ లీడ్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ రోల్ చాలా బోల్డ్ మరియు డార్క్ గా ఉంటుందట. మరి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంటుందో ?

Related posts