telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఆ రాష్ట్రాల నుండి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించిన యూపీ…

కరోనా గత ఏడాది మొత్తం ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. అయితే ఈ ఏడాది జనవరి నుండి మన దేశంలో కరీనా కు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన కేసులు మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకి దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.  కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అనేక రాష్ట్రాలు ప్రయాణాలపైనా, ప్రయాణికులపైనా ఆంక్షలు విధిస్తున్నారు.  మహారాష్ట్ర, కేరళలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రం నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది యూపీ సర్కార్.  కేరళ, మహారాష్ట్ర నుంచి యూపీకి వచ్చే ప్రయాణకులు తప్పనిసరిగా టెస్టులు చేయించుకోవాలని ఆదేశించింది.  రోడ్డు, రైలు, విమాన మార్గాల నుంచి వచ్చే ప్రయాణికులకు యాంటిజెన్ టెస్టులు చేయాలనీ, ఒకవేళ అందులో పాజిటివ్ వస్తే ఆర్టిపీసీఆర్ టెస్టులు చేయాలని, అందులో కూడా పాజిటివ్ గా నిర్ధారణ జరిగితే వారిని హోమ్ ఐసోలేషన్ కు తరలించాలని ఆదేశించింది.  ఒకవేళ ఆర్టిపీసీఆర్ టెస్టుల్లో నెగెటివ్ గా వస్తే వారిని వారం రోజులపాటు హోమ్ క్వారంటైన్ కు తరలించాలని యూపీ సర్కార్ ఆదేశించింది. అయితే ఈ రాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతుండటంతో మిగితా రాష్ట్రాలు అని ఇలానే చేస్తున్నాయి.

Related posts