telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

అక్కడ ఒక్క రూపాయికే వైద్య పరీక్షలు..

1050 more medical seats to telangana

రూపాయికే అంతిమయాత్ర కార్యక్రమం అమలు చేసి ప్రశంసలు పొందిన కరీంనగర్‌ నగరపాలక మేయర్‌ రవీందర్‌ సింగ్‌ మరిన్ని పథకాలకు శ్రీకారం చుట్టారు. శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ. పబ్లిక్‌ హెల్త్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి ఒక్క రూపాయికే రక్త, మూత్ర, బీపీ చెకప్‌ చేసే విధంగా పథకాన్ని రూపొందించామని తెలిపారు. కార్పొరేషన్‌ ఆవరణలోనే పబ్లిక్‌ హెల్త్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. 

వైద్య పరీక్షల కోసం వేల రూపాయల ఖర్చును భరించలేని పేదల కోసం ఈ పథకం ఉపయోగపడుతుందని చెప్పారు. ఇప్పటికీ చెప్పులు లేకుండా నడిచేవారు ఉన్నారని వారందరికీ చెప్పులు అందించే విధంగా బూట్‌హౌస్‌ పథకం ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ఇళ్లలో మూలన పడి ఉన్న పాత చెప్పులు, బూట్ల జతలు తీసుకొచ్చి రిపేర్లు చేసి అందిస్తామన్నారు నగరంలోని కమ్యూనిటీ హాళ్లలో నాలుగు రీడింగ్‌రూంలు ఏర్పా టు చేసి ఒకటి మహిళలకు కేటాయిస్తామని పేర్కొ న్నారు.

Related posts